వీడియో న్యూస్

సాఫ్ట్‌వేర్ జాబుని, ప్రేమించిన అమ్మాయిని వదులుకుని…రైతు గా మారిన “కార్తీక్”.. నిజమైన శ్రీమంతుడు!

look-here ts2apnews

“కార్తీక్” అనే వ్యక్తి  “employee of the year” అనే అవార్డ్ ను అతను పని చేసే సాఫ్ట్‌వేర్ కంపెనీ నుండి తీసుకోవడంతో ఈ షార్ట్ ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది. అతను ఇంటికి వెళ్లే దారిలో అతని ఫ్రెండ్ “చైత్ర” కలుస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా…కార్తీక్ వాళ్ళ నాన్న అతనికి ఫోన్ చేస్తారు. కొద్దిసేపు ఫోన్ మాట్లాడిన తరవాత ఇద్దరు లవర్స్ షాపింగ్ కి వెళతారు. చైత్ర వాళ్ళ నాన్న కార్తీక్ ని అల్లుడిగా చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. కానీ అదే సమయంలో కార్తీక్ “నేను రైతు అవుదాము అనుకుంటున్నా” అంటాడు.ఆ తరవాత వాళ్ళ పెళ్లి జరిగిందా? కార్తీక్ రైతు అయ్యాడా? అనేది తెలియాలి అంటే “శ్రీకారం” అనే షార్ట్ ఫిల్మ్ చూడాల్సిందే!

Cast :
Kiran, Lavanya, Naveen Etika, Rajasekhar, Kaliccharan, Karthik Sai & Ravi Teja

Crew:
Publicity Design: BSP Roy
Editing: RaviTeja Nannimala & Naresh Boorgu
Director of Photography: Saai Santosh
Asst. Camera: Aravind & Avinash
Music: Jaya Phanikrishna
Lyrics: Bharadwaj
Direction Department: RJ Vinay, Mani Murali & Chiru
Production controller: Rj Vinay
Executive producer: Anusha Chichili
Co-producer: Suvvari Avinash Naidu
Producers: Rajesh Yabaji & Vinod Reddi
Written & directed by Kishorudu

డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు…ఇంజినియర్ కొడుకు ఇంజినియర్ అవుతున్నాడు. కానీ రైతు కొడుకు ఎందుకు రైతు అవ్వట్లేదు అనే మనోవేదనను కళ్ళకుకట్టినట్టు చూపించారు దర్శకుడు “కిశోరుడు” గారు. డైలాగ్స్ అన్ని హృదయానికి హత్తుకునేలా ఉన్నాయి. కిరణ్, లావణ్యల ఆక్టింగ్ అయితే అందరి ప్రశంసలు అందుకునే స్థాయిలో ఉంది. ఫనికృష్ణ గారు అందించిన మ్యూసిక్ కూడా సినిమాలోని మంచి ఎలిమెంట్ గా నిలిచింది. సినిమాటోగ్రఫీ అయితే అత్యద్భుతంగా ఉంది. చివరగా వచ్చిన పాటకి “భరద్వాజ్” గారు అందించిన లిరిక్స్ అయితే ఉత్తేజ భరితంగా ఉంది. మొత్తం మీద ఒక్కమాటలో చెప్పాలంటే “MR PRODUCTIONS” వారు మరొకసారి ఒక స్పూర్తిదాయకమయిన షార్ట్ ఫిల్మ్ అందించారు.

Watch Video: Sreekaaram Short Film

Post Comment