మూవీ రివ్యూస్

మోహన్ లాల్ నటించిన మన్యంపులి రివ్యూ & రేటింగ్.( తెలుగులో…)

look-here ts2apnews

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ చిత్రం ‘పులి మురుగన్’ సూపర్ హిట్టై రికార్డ్ కలెక్షన్లు సాధించిన సంగతి తెలిసిందే. తెలుగులోకి డబ్ చేసిన ఈ చిత్రం ‘మన్యం పులి’ పేరుతో ఈరోజే విడుదలైంది. మరి మలయాళ ప్రేక్షకుల్ని అంతగా అలరించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంతవరకూ ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం…

Cast & Crew:

 • హీరో, హీరోయిన్ః మోహన్‌లాల్‌.. కమలినీ ముఖర్జీ
 • కథనం: ఉదయ్‌కృష్ణ
 • సంగీతం: గోపీసుందర్‌
 • దర్శకత్వం: వైశాక్‌
 • నిర్మాత: సిందూరపువ్వు కృష్ణారెడ్డి

Story: ఓ గిరిజన ప్రాంతానికి చెందిన వ్య‌క్తి పులి కుమార్‌ (మోహన్‌లాల్‌)., అతని కళ్లెదుటే అతని తండ్రిని ఓ  పులి తినేస్తుంది.  త‌ల్లి కూడా మ‌ర‌ణించడంతో…తమ్ముడిని  అన్ని తానై పెంచుతుంటాడు పులికుమార్. తన తండ్రిని చంపిందన్న కోపంతో చిన్న వయసులోనే ఆ పులిని మట్టుబెడతాడు. ఆ తర్వాత త‌నుంటున్న పులియూరుకి పులుల బెడద లేకుండా కాపాడుతుంటాడు. త‌న త‌మ్ముడికి ఉద్యోగం కోసం డాడీ గిరిజ ( జ‌గ‌ప‌తిబాబు )ను సంప్ర‌దిస్తాడు. అందుకోసం డాడీ గిరిజ అడ‌విలోని గంజాయిని ఆయుర్వేద మందుల కోసం తీసుకుర‌మ్మ‌న‌డంతో ఆ ప‌ని చేస్తాడు పులికుమార్. అయితే అది ఆయుర్వేద మందు కాద‌ని మ‌త్తు మంద‌ని తెలుసుకుంటాడు పులికుమార్…. ఆ త‌రువాత ఏం జ‌రిగింది.. పులికుమార్ డాడీ గిరిజ కంపెనీని అడ్డుకున్నాడా..?పులి కుమార్‌కీ మైనా (కమలినీ ముఖర్జీ).. జూలీ (నమిత)లకి మధ్య ఉన్న సంబంధం ఏమిటి.? లాంటి విషయాలు చూడాలంటే వెండితెర మీద చూడాల్సిందే.

Plus Points:

 • మోహ‌న్ లాల్, జ‌గ‌ప‌తి బాబు న‌ట‌న‌
 •  యాక్షన్‌ సన్నివేశాలు
 •  కెమెరా
 • నేప‌థ్య సంగీతం

Minus Points:

 • పాత క‌థ‌
 • వ‌చ్చే స‌న్నివేశాలు ముందే తెలిసిపోవ‌డం

ఈ మన్యం పులి చిత్రం అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సులు, మోహన్ లాల్ పై నడిచే మాస్ సన్నివేశాలు ద్వారా మలయాళంలో పెద్ద హిట్ గా నిలిచింది కానీ తెలుగు ప్రేక్షకుల విషయానికొస్తే మాత్రం రెగ్యులర్ ఇంటర్వెల్ లో వచ్చే అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్స్ మాత్రమే బాగా నచ్చుతాయి. కనుక ఈ యాక్షన్, థ్రిల్ ఎపిసోడ్ లను మినహాయిస్తే రొటీన్ డ్రామా, నేటివిటీ మిస్సవడం వంటి అంశాలని అంగీకరించగలిగితే ఈ సినిమా చూడొచ్చు.

 

Post Comment