వీడియో న్యూస్

రికార్డులు తిరగరాస్తున్న సింగం 3 ట్రైలర్

look-here ts2apnews

సూర్య, అనుష్క, శృతి హాసన్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చిత్రం సింగం 3. యముడు 3గా ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్ సూర్య ఈ చిత్రంలో పవర్ ఫుల్ గా కనిపించనున్నాడు. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి ట్రైలర్ విడుదలైంది.పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఫుల్ ఎంటర్ టైనింగ్ గా ఉన్న ఈ ట్రైలర్ 76 గంటలలో 5 మిలియన్ వ్యూస్ సాధించి రికార్డులు తిరగరాస్తోంది.

ఈ మధ్య కాలంలో కబాలి ట్రైలర్ కి ఈ రేంజ్ లో వ్యూస్ రాగా, ఇప్పుడు సింగం 3 ట్రైలర్ అంత వేగంగా నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఇంక ఈ ట్రైలర్ కి లైక్స్ కూడా భారీగా వస్తోన్నాయి. మరి సింగం3 చిత్రానికి సంబంధించిన ట్రైలర్ కి ఇంత మంచి రెస్పాన్స్ వస్తోండడంతో యూనిట్ చాలా ఆనందంగా ఉంది.

విడుదల తర్వాత ఈ మూవీ కలెక్షన్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటుందనే కాన్ఫిడెంట్ తో కూడా ఉంది. హరి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్ర ఆడియోని నవంబర్ 13న రిలీజ్ చేయాలని యూనిట్ భావిస్తోండగా, డిసెంబర్ 16న మూవీని రిలీజ్ చేయనున్నారు.

Post Comment