సినిమా వార్తలు

చెర్రీ మ‌ర‌ద‌లితో శ‌ర్వానంద్ పెళ్లి

look-here ts2apnews

తెలుగు, త‌మిళ భాష‌ల్లో త‌న‌కంటూ స‌ప‌రేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో శ‌ర్వానంద్ ర‌న్ రాజా ర‌న్ – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు – ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాల‌తో మంచి మార్కెట్ ఏర్ప‌రుచుకున్నాడు. యూత్‌లో ఇప్పుడు శ‌ర్వానంద్‌కు మంచి ఇమేజ్ ఉంది. ఇదిలా ఉంటే శ‌ర్వానంద్ గురించి ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ ఇండ‌స్ట్రీలో పెద్ద సంచ‌ల‌నంగా మారింది.

SHARWANAND MARRIAGE WITH UPASANA KONIDELA'S Cousin SISTER? l Ramcharanఆ న్యూస్ ఏంటో కాదు… మెగా ప‌వ‌ర్ స్టార్ రాంచ‌ర‌ణ్‌కు శ‌ర్వానంద్ తోడ‌ల్లుడు కాబోతున్నాడట‌. చెర్రీకి శ‌ర్వానంద్ తోడ‌ల్లుడు కావ‌డం ఏంటి..వీరిద్ద‌రు క‌లిసి ఏదైనా సినిమాల్లో న‌టిస్తున్నారా ? అని అనుకుంటున్నారా ? కాదు నిజ జీవితంలోనే చెర్రీ- శ‌ర్వానంద్ తోడ‌ల్లుళ్లు అవుతున్నార‌ట‌. రాం చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న సిస్ట‌ర్‌ను శ‌ర్వానంద్ వివాహం చేసుకోనున్నాడ‌ట‌.

ఈ వివాహం గురించి ఇప్ప‌టికే ఇరు వైపు పెద్ద‌లు ఓ అంగీకారానికి వ‌చ్చిన‌ట్టు కూడా తెలుస్తోంది. టాలీవుడ్‌లో ఇప్ప‌టికే
అల్లు అర్జున్ – చెర్రీ – మంచు వార‌బ్బాయిలు – తాజాగా అఖిల్ సైతం రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి చెందిన అమ్మాయిల‌ను పెళ్లాడుతున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లేనే శ‌ర్వానంద్ కూడా చేరిపోయాడు.

శ‌ర్వానంద్ – రాంచ‌ర‌ణ్ మంచి ఫ్రెండ్స్ అన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు చిన్న‌ప్ప‌టి నుంచి కూడా క్లాస్‌మేట్స్‌. ఇక ఇప్పుడు అన్ని కుదిరితే వీరు తోడి అల్లుళ్లు కూడా కాబోతున్నార‌న్న‌మాట‌.

Post Comment