వీడియో న్యూస్

నాని ‘నేను లోకల్’ మూవీ రొమాంటిక్ టీజర్

look-here ts2apnews

టాలీవుడ్ లో ఇప్పటి జనరేషన్ లో ఉన్న బెస్ట్ యాక్టర్స్ లో నాని పేరు ప్రముఖంగా చెప్పుకోవాలి. ఎలాంటి సీన్ అయినా.. ఎదురుగుండా ఎలాంటి యాక్టర్స్ ఉన్నా.. సింగిల్ గానే మెప్పించేయగలగడం నాని స్పెషాలిటీ. వరుస హిట్స్ తో జోరు మీదున్న నాని.. ఇప్పుడు నేను లోకల్ అంటూ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే చాలావరకూ షూటింగ్ పూర్తయిపోగా.. ఇప్పుడు నేను లోకల్ కు పబ్లిసిటీ యాక్టివిటీస్ స్టార్ట్ చేసేశారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఇప్పుడు విడుదలయింది. కేవలం ఒకే సీన్ తో టీజర్ మొత్తాన్ని ఇచ్చేసినా.. అక్కడ నాని ఉన్నాడు కాబట్టి ఈజీగా మెప్పించేశాడు. హీరోయిన్ కి హీరో సైట్ కొట్టే సీన్ అన్నమాట. అద్దంలో ఉన్న అమ్మాయిని.. వెనకనుంచి చూస్తూ.. కళ్లతోనే మాట్లాడేశాడు నాని. హీరోయిన్ కీర్తి సురేష్ తో.. హీరో నాని కెమిస్ట్రీ ఏ రేంజ్ లో వర్కవుట్ అయిందో చెప్పేందుకు ఈ ఒక్క సీన్ చాలు.

ఇప్పటివరకూ టీజర్ అంటే.. స్టోరీ చెప్పాలా.. డైలాగ్ ఇవ్వాలా.. హీరోయిజం చూపించాలా అంటూ బోలెడు లెక్కలు ఉంటాయ్. కానీ నాని మాత్రం కేవలం సింగిల్ సీన్ తోనే.. ఆడియన్స్ ను ఆకట్టుకున్నాడు. నేను లోకల్ ఫస్ట్ లుక్ ఇచ్చినపుడు.. ఇదేదో మాస్ మూవీ అన్నట్లుగా ఉంటే.. ఇప్పుడు టీజర్ లో మాత్రం సూపర్బ్ లవ్ స్టోరీ చూపించబోతున్నారనే విషయాన్ని చెప్పారు. మొత్తం మీద నాలుగో సినిమా నేను లోకల్ అంటూ నాని మెప్పించేట్లుగానే ఉన్నాడు.

Post Comment