వార్తలు

70 ఏళ్ల వయసులోనూ ఆ మంత్రికి ఇలాంటి భంగిమలు అవసరమా?

look-here ts2apnews

ఏడు పదుల వయసు. అంటే సీనియర్ సిటిజన్ అన్నమాట. పైగా రాజకీయనాయకుడు. అంతకుమించి ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రి కూడా. అంటే ఆయన ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత హుందాగా ప్రవర్తించాలి. కానీ ఆయన తన వయసు మర్చిపోయారు, బాధ్యతలను గాలికొదిలేశారు, వెధవ పనులకు పాల్పడ్డారు, కక్కుర్తి పడ్డారు. ఫలితం అనుభవిస్తున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల్లో చిక్కుకుని చివరకు పదవినే కోల్పోయారు.

వివరాల్లోకి వెళితే.. కర్నాటక రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రుల వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. కర్నాటక ఎక్సైజ్ శాఖమంత్రి హెచ్ వై మేటి(71) చిక్కుల్లో పడ్డారు. ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు మిన్నంటాయి. హెచ్ వై మేటి ఓ మహిళతో చేసిన శృంగారాన్ని పలు టీవీ ఛానళ్లు పెద్దఎత్తున ప్రసారం చేసి రచ్చరచ్చ చేశాయి. ఆ టేపులో మంత్రిగారు మహిళతో శృంగార భంగిమలో ఉన్నట్లు కనిపించారు.

దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోశాయి. బాధ్యత గల మంత్రిగా ఆయన చేష్టలు దారుణమని, తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. దీనితో వేరే దారి లేక మంత్రిగారు తన రాజీనామా లేఖను సీఎం సిద్ధరామయ్యకు సమర్పించారు.

బదిలీ చేయాలని వచ్చిన మహిళను మంత్రి లైంగికంగా వేధించారని ఆర్టీఐ కార్యకర్త రాజేశేఖర్ ఆరోపణలు చేశారు. అసెంబ్లీలోని తన కార్యాలయంలోనే మంత్రి ఆ మహిళతో రాసలీలలు సాగించారన్న ఆరోపణలొచ్చాయి. బాగల్‌ కోట్‌ కు చెందిన ఓ ఉద్యోగిని బదిలీ విషయమై కొన్నిరోజుల క్రితం మేటి వద్దకు వచ్చింది. నీ పని చేసి పెడతాను, మరి నా కోరిక తీర్చు అంటూ.. మంత్రిగారు ఆమెతో తన కార్యాలయంతో పాటు వివిధ చోట్ల రాసలీలలు సాగించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మ్యాటర్ మీడియాకు ఎక్కడంతో.. మేటి చివరకు తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఒకవేళ మంత్రిపై ఆరోపణలు రుజువైతే కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం సిద్ధరామయ్య తెలిపారు. మంత్రి మేటి బాగల్ కోట్ ఎమ్మెల్యేగా ఉన్నారు.

కర్నాటక కాంగ్రెస్ మంత్రులు… ఇలాంటి అసభ్యకరమైన వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. మొన్న టిప్పు సుల్తాన్ జయంతి వేడుకల్లో పబ్లిక్ లో అంతా చూస్తుండగానే విద్యాశాఖ మంత్రి తన్వీర్ సేతి తన సెల్ ఫోన్ లో నీలిచిత్రాలు చూస్తూ కెమెరాకు రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారు. ఆ ఘోరం మరువక ముందే.. ఇప్పుడు ఎక్సైజ్ శాఖ  మంత్రిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెల్లువెత్తాయి.

అయినా 71 ఏళ్ల వయసులో మంత్రికి ఇడేం పాడు బుద్ధి? ఇదేం కక్కుర్తి? పెద్దాయనే అలా వ్యవహరిస్తే ఇక మిగతా వాళ్ల సంగతేంటని? జనం తిట్టుకుంటున్నారు. పది మందికి మంచి చెప్పాల్సిన పెద్ద మనిషే ఇలాంటి పాడు పనులకు పాల్పడితే ఎలా? అని కసురుకుంటున్నారు.

Post Comment