మూవీ రివ్యూస్

ఇంట్లో దెయ్యం నాకెం భయ్యం మా రివ్యూ & రేటింగ్ ( తెలుగులో…)

look-here ts2apnews

సుడిగాడు’ తర్వాత సక్సెస్ రుచే చూడలేదు అల్లరి నరేష్. గత నాలుగేళ్లలో దాదాపు పది సినిమాలు చేశాడు కానీ.. ఏదీ ఫలితాన్నివ్వలేదు. ఈ మద్య హిట్ ఫార్ముల గ మారిన హారర్ & కామేడి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రం పై అంచనాలు నరేష్ గత సినిమాలతో పోలిస్తే జనాలకు కొంచెం ఎక్కువగానే వున్నాయి .ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అయినా అల్లరోడి రాతను మార్చేలా ఉందో లేదో  సమిక్షలో చూద్దాం.

టైటిల్‌ : ఇంట్లో దెయ్యం నాకేం భయం
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర సినీచిత్ర
నటీనటులు: అల్లరి నరేష్, మౌర్యానీ, కృతిక, రాజేంద్రప్రసాద్, తదితరులు
సంగీతం : సాయి కార్తీక్
నిర్మాత : బీవీఎస్ఎన్ ప్రసాద్
దర్శకత్వం : జి.నాగేశ్వరరెడ్డి
రిలీజ్ డేట్‌: 30 డిసెంబ‌ర్‌, 2016

స్టోరీ :
బ్యాండ్ మేళం ట్రూపుకి న‌రేష్ (అల్ల‌రి న‌రేష్‌) ఓన‌ర్‌. అనుకోకుండా మ‌నోడు అప్పుల్లో ఇరుక్కుంటాడు. ఆ అప్పు తీర్చేందుకు డ‌బ్బు కోసం ఓ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని త‌రిమికొడ‌తాన‌ని కాంట్రాక్ట్ కుదుర్చుకుని ఆ ఇంట్లోకి ఎంట్రీ ఇస్తాడు. ఆ ఇంట్లో ఎంట్రీ ఇచ్చాక మ‌నోడు అక్క‌డే ఇరుక్కుపోవాల్సిన ప‌రిస్థితులు త‌లెత్తుతాయి. ఆ టైంలో న‌రేష్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు ? దెయ్యానికి న‌రేష్ ప్రేమించిన అమ్మాయికి ఉన్న సంబంధం ఏమిటి ? న‌రేష్ త‌న ప్రేమ‌ను ఎందుకు వ‌దులుకోవాల్సి వ‌చ్చింది ? చివ‌ర‌కు ఈ క‌థ ఎలా మ‌లుపులు తిరిగి ఎలా ముగిసింది ? అన్న‌దే ఈ సినిమా స్టోరీ.

న‌టీన‌టులు:
న‌టీనటుల విష‌యానికి వ‌స్తే అల్ల‌రి న‌రేష్ సినిమాల్లో చాలా రోజుల నుంచి మిస్ అవుతోన్న కామెడీ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ఈ సినిమాలో మ‌నం చూస్తాం. న‌రేష్‌లో పాత కామెడీ టైమింగ్ చక్క‌గా సెట్ అయ్యింది. ఇక హీరోయిన్ కృతిక జ‌య‌కుమార్‌తో న‌రేష్ ల‌వ్ ట్రాక్ బాగుంది. కృతిక అందంగా కూడా ఉంది. రెండో హీరోయిన్ మౌర్యాని దెయ్యం రోల్‌లో మెప్పించింది. షకలక శంకర్, చమ్మక్ చంద్ర, రాజేంద్ర ప్రసాద్, పోసాని కామెడీతో మెప్పించేందుకు ట్రై చేశారు. వీరిని ఇంకా బాగా వాడుకోవాల్సింది.

ప్ల‌స్ పాయింట్స్ (+) :
– న‌రేష్‌, రాజేంద్ర ప్ర‌సాద్ కామెడీ టైమింగ్‌
– కామెడీ పార్ట్‌
– సినిమాటోగ్ర‌ఫీ
– నిర్మాణ విలువ‌లు

మైన‌స్ పాయింట్స్ (-):
– రొటీన్ క‌థ‌, క‌థ‌నం
– ప‌ర‌మ రొటీన్ స్క్రీన్ ప్లే
– సినిమాలో లెక్క‌కు మిక్కిలిగా బోరింగ్ సీన్లు

Post Comment