సినిమా వార్తలు

సినిమా షూటింగ్ లో అపశృతి, హెలికాఫ్టర్ నుండి సరస్సులోకి దూకి ఇద్దరి దుర్మరణం.

look-here ts2apnews

సినిమా షూటింగ్ లో భాగంగా హెలికాఫ్టర్ నుండి నదిలోకి దూకే సీన్ లో ….ఓ నటుడు , ఓ  స్టంట్ మాస్టర్ల్ చనిపోయారు.  మస్తి గుడి అనే కన్నడ సినిమా షూటింగ్ లో భాగంగా, బెంగుళూరు కు 30KM ల దూరంలో తిప్పగొండన హల్లి అనే సరస్సులోకి హెలికాప్టర్ ద్వారా దూకే సీన్ ను చిత్రీకరిస్తున్న తరుణంలో ఈ ధారుణం చోటు చేసుకుంది….ఈ సినిమా స్టంట్ మాస్టర్  అనిల్, నటుడు  ఉదయ్ లు సరస్సులోకి దూకారు, వీరి అనంతరం హీరో దునియా విజయ్ కూడా ఛాఫర్ నుండి సరస్సులోకి దూకారు.అనిల్ , ఉదయ్ లు చనిపోగా, అతికష్టం మీద హీరో విజయ్ ఈదుకుంటూ ఒడ్డుకు చేరాడు. అనిల్ , ఉదయ్ డెడ్ బాడీలు ఇంకా దొరకలేదు.

సినిమా చిత్రీకరణలో .. ఇటువంటి సాహసపూరిత స్టంట్స్ చేస్తున్న సమయంలో కూడా సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం పై స్థానికులు మండిపడుతున్నారు. ఇద్దరి మృతికి కారణం సినిమా డైరెక్టరే అంటూ అందిన పిర్యాదు మేరకు ఈ సినిమా డైరెక్టర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.

దునియా విజయ్:  దునియా అనే సినిమాతో బెస్ట్ యాక్టర్ విభాంగలో  ఫిల్మ్ పేర్ అవార్డ్ -కన్నడ ను దక్కించుకొని దునియా అనే సినిమా పేరునే ఇంటి పేరుగా ఫేమస్ అయ్యాడు విజయ్. ఇప్పటి వరకు మొత్తం 27 సినిమాలో నటించిన విజయ్, మాస్ హీరోగా కన్నడలో మంచి పేరు సంపాధించాడు.

అనిల్:  కన్నడలో విలన్ రోల్స్ పోషించే అనిల్…ఈ ఘటనలో మృతిచెందాడు.

Post Comment