వార్తలు

అమ్మ ఇక లేరు – మృతువు తో పోరాడి ఓడిన జయలలిత

look-here ts2apnews

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశారు. కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న జయలలిత నిన్న సాయంత్రం గుండెనొప్పి రావడంతో మళ్లీ పరిస్థితి విషయమించడం జరిగింది. సోమవారం ఉదయం నుండి ఆమె గురించి ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని అభిమానులు కార్యకర్తలు అంతా ఎదురుచూశారు. సాయంత్రం హెల్త్ బులిటెన్ లో పర్వాలేదు అన్నట్టు ప్రకటించినా అప్పటికే తమిళ ఛానెల్ అమ్మ మరణించిన వార్త ఎనౌన్స్ చేసింది.

చివరగా 05-12-2016 సోమవారం రాత్రి 11:30 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారని అపోలో హాస్పిటల్ వారు ఇచ్చిన స్టేట్మెంట్ లో వెల్లడించారు. తమిళ నాట రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన అమ్మ ఇక లేరు అన్న వార్త వినడానికి ప్రజల గుండె బరువెక్కిపోతుంది. ఇక తదుపరి కార్యక్రమాల గురించి త్వరలో ప్రకటన వెలువడనుంది.

Post Comment