వార్తలు

ప్రధాని మోడీ హత్యకు కుట్ర!

look-here ts2apnews

”నా ప్రాణాలకు ప్రమాదం ఉంది” మొన్న మోడీ చెప్పిన ఈ మాటలు విన్నవారు అంతా డ్రామా అనుకున్నారు. కానీ… తాజా పరిణామాలు చూసి షాక్ తింటున్నారు. నిన్నరాత్రి 11.30 గంటల సమయంలో పోలీసులకు వచ్చిన ఫోన్ కాల్ సంచలనంగా మారింది. ”’ప్రధాని మోడీని చంపేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారు.. వారి సంబాషణలు నేను విన్నాను” అంటూ ఫోన్ చేసిన వ్యక్తి చెప్పడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమైపోయారు. ప్రధాని భద్రతా వ్యవస్థ మొత్తం అలర్టయిపోయింది. నిఘా వర్గాలు అంతా సునిశితంగా గమనిస్తున్నాయి.

ఢిల్లీలోని బురారి ప్రాంతానికి చెందిన దినేశ్ అనే వ్యక్తి ఫోన్ నుంచి ఈ కాల్ వచ్చినట్లుగా గుర్తించారు. అయితే.. కాల్ చేసిన ప్రాంతం దిల్ షాద్ కాలనీగా పోలీసులు గుర్తించి వెంటనే అక్కడకు చేరుకున్నారు. అక్కడెవరూ లేకపోవడంతో దినేశ్ కోసం వెతికి పట్టుకున్నారు. తన సిమ్ ను బంధువుకు ఇచ్చానని ఆయన చెప్పడంతో ఆ బంధువును పట్టుకున్నారు.

అయితే… ఆయన తాను అక్కడి హోటళ్లో తాను టిఫిన్ తింటుండగా ఓ వ్యక్తి వచ్చి ఫోన్ చేసుకోవాలని అడగడంతో ఇచ్చానని చెప్పాడు. హోటల్ యజమాని ఆ సమయంలో అక్కడున్న కొందరు కస్టమర్లు కూడా దాన్ని ధ్రువీకరించారు. ఆ తరువాత పోలీసులు మెరుపువేగంతో స్పందించి అలా ఫోన్ తీసుకున్న వ్యక్తిని ట్రేస్ చేశారు. ఆయన్ను ప్రశ్నించగా ఫోన్ లో చెప్పిన విషయాన్నే పోలీసులకూ చెప్పాడు. కొంతమంది అక్కడ మాట్లాడుకుంటుంటే తాను విన్నానని…. మోడీని హత్య చేయడం గురించి వారు ప్లాన్ చేసుకుంటున్నారని… అది విని వెంటనే ఫోన్ అడిగి పోలీసులకు సమాచారం ఇచ్చానని చెప్పాడు. వివరాలన్నీ సరిపోలడంతో పోలీసులు ఆ కథనాన్ని నమ్మారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. మోడీ భద్రత మరింత కట్టుదిట్టం చేస్తున్నారు.

Post Comment