సినిమా వార్తలు

(వీడియో): బేతాళుడు సినిమా లీక్ అయ్యింది…..చూడండి

look-here ts2apnews

బిచ్చగాడు సినిమాతో ఫేమస్ అయిన నటుడు విజయ్ అంటోనీ కథానాయుకుడిగా తమిళంలో ‘సైతాన్’ అనే సినిమా రూపొందుతోంది. ఈ సినిమా తెలుగులో ‘బేతాళుడు’ పేరుతో రాబోతుంది. అయితే విడుదలకు ముందే ఈ సినిమాకు సంబంధించిన 10 నిమిషాల నిడివి గల వీడియో ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది.

అయితే ఈ సినిమా లీక్ కాలేదు…ఈ సినిమా హీరో విజ‌య్ ఆంటోనీనే స్వ‌యంగా లీక్ చేశాడు. తమ సినిమాను ఓ 10 నిమిషాలు చూస్తే ఖచ్చితంగా మిగతా భాగాన్ని చూడాలనే ఆసక్తి కలిగి ప్రేక్షకులు థియేటర్లకు వస్తారనే నమ్మకంతో ఇలా చేశారట.

సైకాలజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాను తెరకెక్కించారు. లీక్ చేసిన 10 నిమిషాల సినిమాను చూస్తే జయలక్ష్మీ టీచర్ ఆలోచనలతో హీరో పరధ్యానంగా ఏదో లోకంలో ఉన్నట్లు కనబడతాడు. నవంబర్ 18 విడుదల కావాల్సిన ఈ సినిమా కరెన్సీ బ్యాన్ కారణంగా డిసెంబర్ 2కు వాయిదా పడింది.

ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన హీరోయిన్‌గా అరుంధతి నాయర్ నటించింది. ఈ సినిమాకు మ్యూజిక్ అందించింది కూడా ఈ సినిమా హీరో విజయ్ అంటోనే కావడం మరో విశేషం. డిసెంబర్ 2న తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి ఈ సినిమా విడుదల చేయనున్నారు. లీక్ అయిన బేతాళుడు 10 నిమిషాల ఆడియోపై ఓ లుక్కేయండి.

Post Comment