వీడియో న్యూస్

రికార్డ్ లను తిరగరాసిన మన తెలుగోడి షార్ట్ ఫిల్మ్…2 కోట్ల వ్యూస్ దాటిన PK-2

look-here ts2apnews

సౌత్ ఇండియాలోనే ఇదో అతి పెద్ద రికార్డ్…ఇంత వరకు ఏ లఘుచిత్రానికి దక్కని ఘనత మన తెలుగు కుర్రాడు తీసిన షార్ట్ ఫిల్మ్ కు దక్కింది. 2015 జనవరిలో శ్రీకాంత్ రెడ్డి అనే డైరెక్టర్ తీసిన PK-2 అనే షార్ట్ ఫిల్మ్ ను యూట్యూబ్ లో చూసిన వారి సంఖ్య 2 కోట్లు దాటింది. వాస్తవానికి ఇండియా మొత్తంగా చూసుకున్నా… ఏ షార్ట్ ఫిల్మ్  వ్యూస్ కూడా 2 కోట్లు దాటలేదు.( ఎంటర్టైన్మెంట్ పరంగా..) కబాలి ట్రైలర్ నుండే  యూట్యూబ్ వ్యూస్ 2 కోట్లు దాటటం మొదలు పెట్టాయి. కబాలి తర్వాత కొన్ని పెద్ద హిందీ సినిమాల ట్రైలర్లే 2 కోట్ల మార్క్ ను దాటాయి. అలాంటిది….సింపుల్ బడ్జెట్ తో, ఓ చిన్న కాన్సెప్ట్ తో మన తెలుగు కుర్రాడు తీసిన ఓ షార్ట్ ఫిల్మ్ ను 2 కోట్ల మంది చూశారంటే మాటలు కాదు.

PK సినిమాను పేరడిగా చేస్తూ ఢైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి చేసిన ప్రతయ్నం బాగుంది, నవ్విస్తూనే, మనదేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యను  ఫోకస్ చేశాడు. PK గా నటించిన జయకృష్ణ యాక్టింగ్, PM గా యాక్ట్ చేసిన రవి రాజమౌళి హావాభావాలు అమితంగా ఆకట్టుకున్నాయి. శ్రీకాంత్ రెడ్డి తీసిన మరో స్పూఫ్…బాహుబలి-2 కూడా యూట్యూబ్ ను షేక్ చేసింది… ఇప్పటికే 50 లక్షల వ్యూస్ ను దాటేసింది.

 

Post Comment